రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ సంగీత సత్యనారాయణ

by Disha Web Desk 1 |
రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్ సంగీత సత్యనారాయణ
X

మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి

దిశ, పెద్దపల్లి : ధాన్యం దిగుమతి విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే రైస్ మిల్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం సుల్తానాబాద్ లోని మోహన్ కృష్ణా రైస్ మిల్, భవాని శంకర్, లక్ష్మీనారాయణ, వరలక్ష్మి, హరి శంకర్, భవాని ఎంఆర్ రైస్ మిల్లును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం సకాలంలో దించుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు అలాట్ చేసిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకోవాలని, రైస్ మిల్లర్లకు గోడౌన్లలో స్థలం కొరత సమస్య ఉంటే తాత్కాలికంగా ఇంటర్మీడియట్ గోడౌన్లలో స్థలం కల్పిస్తామని, వారికి కేటాయించిన ధాన్యాన్ని మాత్రం తప్పనిసరిగా దించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి తోట వెంకటేష్, డీటీసీఎస్ శంకర్ గౌడ్ సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed