- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ, ఎఫెక్ట్: స్టాంపింగ్ ఉన్న మటన్ ని మాత్రమే విక్రయించాలి
మండల ప్రజలకు నాణ్యమైన మటన్ ని మాత్రమే అందించాలనే నేపథ్యంలోనే ఈ తనిఖీలు అని వెటర్నరీ డా.నిఖిల అన్నారు.

దిశ, ముస్తాబాద్ : మండల ప్రజలకు నాణ్యమైన మటన్ ని మాత్రమే అందించాలనే నేపథ్యంలోనే ఈ తనిఖీలు అని వెటర్నరీ డా.నిఖిల అన్నారు. దీనిలో భాగంగా ఆదివారం జరిగిన మటన్ షాపుల తనిఖీల్లో ఆమె పాల్గొంది.అప్పటివరకు రోజు తనిఖీలు చేస్తున్న కూడా ఇటీవల దిశలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి తనిఖీల్లో వేగం పెంచారు. కొందరు మటన్ విక్రేతలు మేకలపై స్టాంపింగ్ వేయించకుండా మటన్ కోసి అమ్మతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని డా.నిఖిల తెలిపారు.
మటన్ విక్రేతలు సహకరించి అందరు స్టాంపింగ్ వేయించుకోవాలని కోరింది.కొందరు మాత్రం స్టాంపింగ్ ఉన్న మాంసాన్నే అమ్ముతున్నారని తెలిపింది.జిపి నుండి ఆదివారం రోజున ఈఓ తనిఖీల్లో పాల్గొనకుండా కింది స్థాయి సిబ్బంది ని పంపించడం పలు విమర్శలకు తావిస్తోంది.కొందరు విక్రేతలు నాణ్యమైన మటన్ ప్రజలకు అందించడం లేదని వారి దృష్టికి వచ్చిన కూడా వారికి నోటీసులు ఇవ్వాల్సి ఉండగా జిపి అధికారులు నోటీసులు అందివ్వడంలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.దీనిపై ఈఓ వివరణ ఇవ్వాల్సి ఉంది.






