అధికారులు అనుక్షణం అలెర్ట్ గా ఉండాలి

by velandi.Saikiran |

ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.మంగళవారం

అధికారులు అనుక్షణం అలెర్ట్ గా ఉండాలి
X

దిశ, అంతర్గాం: ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.మంగళవారం అంతర్గాంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్ ను అధికారులతో కలిసి సందర్శించి,క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.ప్రస్తుతం ప్రాజెక్టు సామర్థ్యం,ప్రజెంట్ నీటి నిల్వ ఎంత,ఇన్ ఫ్లో ఎంత ఆనే వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల ఆరా తీశారు.ప్రస్తుతం 35 గేట్ల ద్వారా ఎల్లంపల్లి నుంచి దిగువకు వరద విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున వరద వస్తున్నందున ఎల్లంపల్లి దిగువకు నీరు విడుదల చేస్తున్నామని,ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు,చేపలు పట్టేవారు,రైతులు,సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,నది దాటే ప్రయత్నం చేయరాదని పేర్కొన్నారు.ప్రాజెక్టులో నీటి నిల్వ పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.ఎగువ నుంచి వస్తున్న వరద ఆధారంగా ఎప్పటికప్పుడు దిగువకు నీరు విడుదల చేయాలని సూచించారు.డ్యాం గేట్లను పరిశీలించి వాటి నిర్వహణను పర్యవేక్షించారు.

నీటి విడుదల అంశాలు రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేయాలని ప్రాజెక్ట్ అధికారులకు తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు,రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి రామగుండం మండలంలోని ముంపు ప్రాంతం మల్కాపూర్ గ్రామంలో పర్యటించి లోతట్టు ప్రాంతాలలో నీరు ఒకే చోట నిల్వకుండా చర్యలు తీసుకోవాలని,అధికారులు అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సీఈ సుధాకర్ రెడ్డి,ఎస్.ఈ.సత్యనారాయణ,డీఈ బుచ్చి బాబు,శరత్ బాబు,తహసిల్దార్ ఈశ్వర్, ఈఈ రామన్ లతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Next Story