ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడ‌లు దిన‌చ‌ర్య‌లో భాగ‌మై ఉండాలి

by Ratna Kumari |

క్రీడలు దినచర్యలో భాగమై ఉండాలని, అప్పుడే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మాజీ జ‌డ్పీటీసీ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడ‌లు దిన‌చ‌ర్య‌లో భాగ‌మై ఉండాలి
X

దిశ, సుల్తానాబాద్ : క్రీడలు దినచర్యలో భాగమై ఉండాలని, అప్పుడే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మాజీ జ‌డ్పీటీసీ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా యూత్, స్పోర్ట్స్ వీక్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు సుల్తానాబాద్ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యూత్, స్పోర్ట్స్ అథారిటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలా రమేష్ మాట్లాడుతూ జీవితంలో క్రీడలు అనేది అత్యంత ఆవశ్యకమైనది ఆరోగ్యంగా ఉండడానికి రోజు ఏదో ఒక క్రీడల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొనాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, కందునూరి ప్రకాష్ రావు, స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి అమిరిశెట్టి తిరుపతి, కౌన్సిలర్ లు శ్రావణి -రాకేష్, శోభ -శ్రీనివాస్, దాసరి రమేష్,ఖేలో ఇండియా కోకో కోచ్ గెల్లు మధుకర్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రణయ్, వెంకటేష్, కుమార్, అజ్జు, దుర్గాప్రసాద్ వాకర్స్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story