చదువుకు క్రీడలే ఉత్తేజితాలు

by Ratna Kumari |

విద్యార్థుల్లో చదువు పట్ల ఉత్సాహాన్ని, ఏకాగ్రతను పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా స్పోర్ట్స్ డైరెక్టర్ పుల్లూరు సాయి కృష్ణ పేర్కొన్నారు.

చదువుకు క్రీడలే ఉత్తేజితాలు
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : విద్యార్థుల్లో చదువు పట్ల ఉత్సాహాన్ని, ఏకాగ్రతను పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా స్పోర్ట్స్ డైరెక్టర్ పుల్లూరు సాయి కృష్ణ పేర్కొన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్ లోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్వహించిన 'కమలాట్రోఫీ-26' క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. ​క్రీడలతోనే సామాజిక వికాసం కళాశాల ప్రిన్సిపాల్ కె. శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు సభలో సాయికృష్ణ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ​విద్యార్థులను ఒక తాటిపైకి తెచ్చి, ఐక్యమత్యంగా ఉంచేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ​క్రీడల ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని, ఇది విద్యార్థిని సమాజంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు.

​గెలుపోటములు సమానమే..

​ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శంకర్ మాట్లాడుతూ.. క్రీడాకారులకు గెలుపు కంటే ఆటలో పాల్గొనడమే ముఖ్యమని ఉద్ఘాటించారు. ఓటమిని స్వీకరించినప్పుడే విజయానికి మార్గం సుగమం అవుతుందని, నిరంతర సాధనతోనే సామర్థ్యం పెరుగుతుందని విద్యార్థులకు సూచించారు. ​కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వి. శ్రీనివాసరావు ఈ పోటీల వివరాలను వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి దాదాపు 400 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా ట్రోఫీలు, షీల్డ్ లు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ​ఈ కార్యక్రమంలో కార్యక్రమ సమన్వయకర్తలుగా లిఖిత, ముఖేష్, పూర్వ విద్యార్థుల సమన్వయకర్తలుగా కె. పవన్ కుమార్, యు. శేఖర్, గణేష్ పాల్గొన్నారు.

Next Story