- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజుగారి బిర్యానీ.. ఫ్రెష్ బిర్యానీ పేరుతో కుళ్లిన చికెన్ స్పెషల్స్!
శుభ్రత నాణ్యతతో సంబంధం లేకుండా నడుస్తున్న "రాజుగారి బిర్యానీ అడ్డా" లో ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు

దిశ, కరీంనగర్ టౌన్ : శుభ్రత నాణ్యతతో సంబంధం లేకుండా నడుస్తున్న "రాజుగారి బిర్యానీ అడ్డా" లో ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కుళ్లిన చికెన్, పాచిపోయిన ఆహార పదార్థాలు, ఎక్స్ పైరీ ఐటమ్స్ మొదలైనవి పెద్దమొత్తంలో బయటపడ్డాయి. మల్కాపూర్ రోడ్‌లోని ఈ ప్రాంగణంలో జరిగిన తనిఖీల్లో అధికారులు చూసిన దృశ్యాలు వారిని కుదిపేశాయి.
రెస్టారెంట్ కిచెన్, ఫ్రీజర్ ప్రాంతాల్లో చెక్ చేసిన అధికారులు, ముందు రోజు మిగిలిపోయిన అనేక రకాల చికెన్ ఐటమ్స్ నిల్వగా ఉన్నాయని గుర్తించారు. వాటిని వెంటనే పారేసినట్లు కరీంనగర్ ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి తెలిపారు. కేవలం చికెన్ మాత్రమే కాదు, కార్న్, వెజ్ వంటకాలూ పాడైపోయినవేనని గుర్తించి, వాటినీ తొలగించారని చెప్పారు.
అంతేకాక, చికెన్ ఐటమ్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ రంగులు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై నిర్వాహకులను కఠినంగా హెచ్చరించి, నోటీసులు జారీ చేశారు. నాన్ వెజ్ వంటకాల్లో ఉపయోగించే ముడి పదార్థాలపై తప్పనిసరిగా తేదీ లేబుల్ ఉండాలన్న నియమాన్ని పాటించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలు కరీంనగర్ పట్టణంలో ఫుడ్ హైజిన్ పై మరోసారి ప్రశ్నలు రేకెత్తించాయి. ప్రజలు వీటిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






