సత్వర న్యాయం గ్రీవెన్స్ డే లక్ష్యం

by Sridhar Babu |

బాధితులకు సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.

సత్వర న్యాయం గ్రీవెన్స్ డే లక్ష్యం
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : బాధితులకు సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో బాధితుల నుండి 18 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది బాధితుల ఫిర్యాదులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

Next Story