KTR కు ఈ విషయం తెలిస్తే నిద్ర పట్టదనుకుంటా..!

by S Gopi |   (  Updated:2023-01-22 05:56:35  IST  )

ఎల్లారెడ్డిపేట మండలము సర్వాయిపల్లి గ్రామ శివారులో గల పెట్రోల్ బంక్ ను ఎల్లారెడ్డిపేట..Special Story Over Petrol Bank Which One Was launched by KTR

KTR కు ఈ విషయం తెలిస్తే నిద్ర పట్టదనుకుంటా..!
X

దిశ, సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలము సర్వాయిపల్లి గ్రామ శివారులో గల పెట్రోల్ బంక్ ను ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో డీజిల్ బంక్ ను ఏర్పాటు చేశారు. ఈ డీజిల్ బంక్ ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. కొద్దిరోజుల పాటు డీజిల్ బంక్ ఏర్పాటు చేసిన సింగిల్ విండో పాలకవర్గం డీజిల్ బంక్ ద్వారా రైతులకు డీజిల్ అందజేశారు. డీజిల్ బంక్ లో డీజిల్ లేకపోవడంతో రైతులు మండలంలోని ఎల్లారెడ్డిపేట రాచర్ల గొల్లపల్లిలో గల పెట్రోల్ బంక్ లలో నుండి డీజిల్ ట్రాక్టర్లు, డీజిల్ ను తెచ్చుకోవడం కోసం వెళ్తున్నారు. సొసైటీ ద్వారా ప్రజాధనం వృథా చేస్తూ రూ. లక్షలు వెచ్చించి లక్షణముగ వదిలేశారని, ఇప్పటికైనా ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో పాలకవర్గం స్పందించి డీజిల్ బంక్ లో డీజిల్ అమ్మకాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి : Breaking News.. IAS Smita Sabarwal ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన డిప్యూటీ తహశీల్దార్



Next Story