చేతిపంపులు కనుమరుగు

by velandi.Saikiran |   (  Updated:2026-03-11 21:15:42  IST  )

గ్రామాల్లో నీటి అవసరాలు తీర్చిన చేతి పంపులు ఇప్పుడు కనుమరుగు అవుతున్నాయి. చేతి పంపులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

చేతిపంపులు కనుమరుగు
X

చేతిపంపులు కనుమరుగు

కొన్ని చోట్ల అసంపూర్తిగా దర్శనం

పట్టించుకోని అధికారులు

అసలే వేసవికాలం కావడంతో

ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

అసంపూర్తిగా ఉన్న వాటిని

మరమ్మతు చేయాలని విజ్ఞప్తి

దిశ, ముస్తాబాద్ : గ్రామాల్లో ప్రజల నీటి అవసరాలు తీర్చిన చేతి పంపులు ఇప్పుడు కనుమరుగు అవుతున్నాయి. చేతి పంపులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్న చేతి పంపులు పూర్తిగా అధ్వానంగా తయారయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ మండల లోని గ్రామాలలో ప్రజల నీటి అవసరం తీర్చిన చేతి పంపులు నేడు ఎక్కడ కనిపించక మరుగున పడడం, కొన్ని చోట్ల ఉన్న పంపులు పనిచేయక అధ్వానంగా తయారయ్యాయి. అసలే వేసవికాలం వ్యాపిస్తున్న నేపథ్యంలో నీరు అందక ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నా పరిస్థితి ఇప్పుడే నెలకొంది. చేతిపంపులపై ఆధారపడి తమ తాగునీటి అవసరాలు తీర్చుకునేవారు ప్రస్తుతం ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు.

వేసవికాలంలో గ్రామాలలో నీటి ట్యాంకులు ఏర్పాటు చేసే విధంగా తోడ్పడాలని ప్రజలు కోరుతున్నారు. అత్యవసర సమయంలో నీరు అందించే చేతి పంపులు కనుమరుగు అవుతున్నాయి. అలాంటి చేతి పంపులను ప్రస్తుతం పట్టించుకోనే నాధుడే కరువయ్యారని గ్రామ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో తాగునీటి అవసరాల కోసం చేతి పంపు దగ్గరకు వెళ్లే ప్రజలు చేతి పంపుల ద్వారా నీళ్లు తీసుకువచ్చే వాళ్లమని ఇప్పుడు వాటి నుంచి నీటిని అందుకునే అవసరం సాధ్యమవడం లేదని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మండలంలోని వివిధ గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న చేతిపంపులను పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story