చెక్​డ్యామ్​కూలిన ఘటనపై రాజకీయ దుమారం

by Ajay Maddhiboyina |

తనుగుల చెక్ డ్యాం మూడు రాజకీయ పార్టీలకు ప్రస్తుతం ఆయుధంగా మారింది. తనుగుల వద్ద రూ.23 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం ను ఈ నెల 21 న గుర్తుతెలియని వ్యక్తులు జిలేటిన్ తో పేల్చివేశారని, వీరి వెనుక కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందని ఏకంగా మాజీ మంత్రి హరీశ్ రావు సంఘటన స్థలానికి వెళ్లి విమర్శించడం ,

చెక్​డ్యామ్​కూలిన ఘటనపై రాజకీయ దుమారం
X

దిశ, హుజూరాబాద్: తనుగుల చెక్ డ్యాం మూడు రాజకీయ పార్టీలకు ప్రస్తుతం ఆయుధంగా మారింది. తనుగుల వద్ద రూ.23 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం ను ఈ నెల 21 న గుర్తుతెలియని వ్యక్తులు జిలేటిన్ తో పేల్చివేశారని, వీరి వెనుక కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందని ఏకంగా మాజీ మంత్రి హరీశ్ రావు సంఘటన స్థలానికి వెళ్లి విమర్శించడం ,అటు కాంగ్రెస్,బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ హయాంలో కట్టిన కట్టడం నాణ్యత లోపించడం తో కూలి పోయిందని విమర్శించడం తో పాటుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సంఘటన పై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయడం తో ఈ చెక్ డ్యాం ప్రస్తుతం రాజకీయ పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారింది. తాజాగా ఈ రోజు బీ ఆర్ ఎస్ భవన్ లో కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సంఘటన వెనుక ఉన్న వారి పేర్లు చెప్పి వారిపై ఇంకా కేసు నమోదు చేయలేదని, వారు కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారని విమర్శించడం తో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైన ఈ పరిస్థితుల్లో తనుగుల_గుంపుల మధ్య నిర్మించిన చెక్ డ్యామ్ రాజకీయ నేత ల చేతిలో అస్త్రం అయి గింగిరాలు కొడుతుంది.గ్రామాల్లో తిరిగి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి స్థానిక సంస్థల పై ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.

కోట్ల రూపాయల ఆస్తి నేలపాలు..

ఇసుక వ్యాపారం కోసం ప్రభుత్వం కు చెందిన 23 కోట్ల రూపాయల ఆస్తి నేల పాలు చేయడానికి కేవలం ఇసుక మాఫియా అక్రమాలు కారణమని,ఈ విషయం పై దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.ఇంత జరిగినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయక పోవడం వెనుక స్థానిక పోలీసుల హస్తం ఉందా ?అనే సందేహం కలుగుతుంది.సర్కిల్ పరిధిలోని పోలీసులకు నెల,నెల అందే మామూళ్ళు భారీ స్థాయిలో ఉండడంతో ఇసుక మాఫియా ఆగడాలకు ఇక్కడ అంతే లేకుండా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.నిత్యం వందల ట్రాక్టర్లు బంగారం లాంటి రోడ్లను చిద్రం చేస్తూ వెళుతున్నా పోలీసులు వీరిని పట్టుకున్న పాపాన పోవడం లేదు.ఎప్పుడో ఒకప్పుడు పట్టి పట్టినట్టుగా కేసులు నమోదు చేసి చేతులు దులుపు కోవడం పరిపాటిగా మారిందని,ఇందిరమ్మ ఇళ్ల కు ఇసుక సరఫరా ముసుగులో నెల,నెల లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న ఈ మాఫియా దేనికైనా తెగించే రకంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

కౌశిక్, ప్రణవ్ ల మధ్య హోరాహోరి గుంపుల చెక్ డ్యాం వివాదం ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబుల మధ్య హోరాహోరీ వివాదానికి దారి తీసింది. ఇంత కాలం ఎవరికి వారే రాజకీయ వ్యాపారం చేసుకుంటున్న ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల వేళ వివాదంగా మారింది. ఇది ఇక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న పెద్దపెల్లి వరకు వ్యాపించి అక్కడి నాయకులు సైతం రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ప్రశ్నించే వరకు వెళ్ళింది. నియోజవర్గంలో మొదలైన వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజధానికి మారింది. బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం వివాదంపై రాజకీయ విమర్శలు చేయడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో మూడుపార్టీల మధ్య పెను వివాదంగా మారింది.

Next Story