- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇళ్లు నిర్మించకుండా డబుల్ బెడ్ రూం పట్టాలు
జర్నలిస్టులకు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరిట డబుల్ బెడ్ రూం పట్టాలు పంపిణీ చేయడం వివాదస్పదంగా మారింది.

నాడు అధికారికంగా ఇస్తే
నేడు అనుమతి దేనికి?
ఎన్వో సీ లేకుండా ఎస్ఆర్ఎస్ పీ భూమిలో ప్లాటింగ్
ఇళ్లు నిర్మించకుండా డబుల్ బెడ్ రూం పట్టాలు పంపిణీ
మరోమారు తెరపైకి జర్నలిస్టుల భూవివాదం
జర్నలిస్టేతరులకు పట్టాల పంపిణీ చేసిన గంగుల
అక్రమార్కులకు పంపిణీ చేసి అధికారిక ధ్రువీకరణకు కుట్ర
మాజీ మంత్రి వినతిపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
దిశ, కరీంనగర్ బ్యూరో : అధికారాన్ని అడ్డుపెట్టుకుని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పేరుతో డబుల్ బెడ్ రూం పట్టాల పంపిణీ చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనర్హులు జర్నలిస్టు వృత్తికి సంబంధం లేని అప్పటి పాలకుల వ్యక్తిగత సహాయకులకు, రాజకీయపార్టీల కార్యకర్తలకు పట్టాలను అందేజేయగా నేడు ఆ పట్టాలకు అధికారికంగా అనుమతి ఇవ్వాలంటూ మంత్రులకు విజ్ఞప్తి చేయడంతో జర్నలిస్టుల భూ వివాదం మరోమారు తెరపైకి రాగా మాజీ మంత్రి వ్యవహార శైలిపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పట్టాల పంపిణీ పేరుతో జర్నలిస్టుల ఆశలకు అపహాస్యం
జర్నలిస్టుల చిరకాల ఆశలను అవకాశంగా తీసుకున్న అప్పటి మంత్రి నేటి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారంలో ఉండగా పబ్బం గడుపుకునేందుకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం.. ఇళ్లు కట్టిస్తాం.. అంటూ జర్నలిస్టుల్లో ఆశలు రేకెత్తించారు. పది సంవత్సరాలు కాలయాపన చేసిన గంగుల అధికారం చేజారిపోతున్న చివరి క్షణంలో నాడు జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు పంపిణి పేరిట డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాల పంపిణీ చేసి జర్నలిస్టుల ఆశలను అపహాస్యం చేయగా నేటీకి అవి ఇంటి స్థలం పట్టాల లేక డబుల్ బెడ్ రూం పట్టాల అనే క్లారీటి లేకుండా అందులో ఇళ్లు కట్టుకునేందుకు అనుమతించాలంటూ విజ్ఞప్తి చేయడం జర్నలిస్టు వర్గాలను మరోమారు అపహాస్యం చేయడమే అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
డబుల్ బెడ్ రూం పట్టాలా ? ఇంటి స్థలం పట్టాలా?
నాటి ప్రభుత్వంలో జర్నలిస్టులకు అప్పటి మంత్రి హోదాలో గంగుల కమలాకర్ జర్నలిస్టులకు పంపిణీ చేసిన పట్టాలు ఇళ్ల స్థలాల పట్టాలా? లేక డబుల్ బెడ్ రూం పట్టాలా ముందుగా క్లారిటీ ఇవ్వాల్సిన మాజీ మంత్రి అది విస్మరించి, నేడు ఇండ్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించాలంటూ మంత్రులకు విజ్ఞప్తి చేయడం హాస్యాస్పదంగా మారింది. దీంతో మాజీ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టు సంఘాలు ముందుగా నీవు నాడు అదికారుల సమక్షంలో పట్టాలు పంపిణీ చేసినప్పటికీ ఎందుకు అధికార ధ్రువీకరణకు ఆమోదించబడలేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
నాడు అదికారికంగా ఇచ్చినా...నేడు అనుమతి ఎందుకు?
నాడు జర్నలిస్టులకు మాజీ మంత్రి గంగుల ఇచ్చిన ఇళ్ల స్థలాలకు నేడు అందులో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని నేటి మంత్రులను కోరడం దేనికి అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టుల చిరకాల కోరికపై మాజీ మంత్రి చిత్తశుద్ధి ఏమేరకు ఉందో తెలుస్తుండగా కనీసం ఆ స్థలానికి సంబంధిత శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోకపోవడం పై జర్నలిస్టులు సూటిగా ప్రశ్నిస్తున్నప్పటి కి సమాధానం చెప్పలేని మాజీ మంత్రి మరోమారు జర్నలిస్టుల్లో ప్రభుత్వం పై వ్యతిరేకతను కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇళ్లు నిర్మించకుండా డబుల్ ఇండ్ల పట్టాలు
జర్నలిస్టులకు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరిట డబుల్ బెడ్ రూం పట్టాలు పంపిణీ చేయడం వివాదస్పదంగా మారింది. ఇళ్లు నిర్మించకుండా డబుల్ బెడ్ రూం పట్టాలు పంపిణీ చేసిన మాజీ మంత్రి గంగుల కనీసం ఆ స్థలానికి చెందిన సంబంధిత శాఖ నుంచి ఎన్ వో సీ కూడ తీసుకోకుండా పట్టాలు పంపిణీ చేశారు. జర్నలిస్టుల ఆశలపై నీళ్లు చల్లి అవమానపరిచిన గంగుల తాజాగా ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరడం తన అనుచరవర్గానికి ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా అంట గట్టేందుకే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






