- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బెల్ట్’చిచ్చు..ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు
ఎల్లారెడ్డిపేటలోని గ్రామాల్లో అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణతో మద్యం ఏరులై పారుతుందని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

పచ్చని కుటుంబాలలో
‘బెల్ట్’చిచ్చు
విచ్చల విడిగా మద్యం విక్రయాలు
బానిసల అవుతున్న యువత
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు
అబ్కారీ శాఖ అధికారులపై ప్రజల ఆగ్రహం
దిశ ,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణతో మద్యం ఏరులై పారుతుందని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో మద్యం విక్రయాలు అదుపు తప్పాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రత్యేకించి యువకులు మద్యానికి బానిసలవుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాప్ యజమానులచే ఒప్పందం చేసుకున్న బెల్ట్ షాప్ నిర్వాహకులు మండలంలో యథేచ్ఛగా గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలోని మద్యం దుకాణం సమీప గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎనీ టైం మద్యం విక్రయాలు సాగుతున్నాయి.
కిరాణా దుకాణాలు, హోటల్లు, నివాస గృహాలలో మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు మండల ప్రజలు చెబుతున్నారు. ఉదయం టీ, కాఫీ లకు బదులు మద్యం అందించే పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు . దీంతో ఉదయమే మద్యం సేవించి పలువురు రోడ్లపై పడిపోవడం గాయాలపాలవడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయి. గతంలో వైన్ షాప్ పరిసరాలకే పరిమితమైన ఈ దందా ప్రస్తుతం గల్లీలకు విస్తరించిందని గ్రామస్తులు వాపోతున్నారు, ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మందుబాబుల జేబులను ఖాళీ చేస్తున్నారని, కొందరు బెల్ట్ షాప్ నిర్వాహకులు ఖాతాల పేరుతో అప్పులిచ్చి చెల్లించలేని పరిస్థితుల్లో దౌర్జన్యాలకు దిగుతున్నార నే ఆరోపణలు ఉన్నాయి. అనేక కుటుంబాలలో కలహాలు చెలరేగి పచ్చని కాపురాలు చిధ్రమవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కమీషన్లతో మద్యం సరఫరా ?
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని లైసెన్స్ పొందిన వైన్ షాప్ యజమానులు గ్రామాల్లో కమీషన్లతో మద్యం వికయాలు చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళలో బెల్ట్ షాపులకు మధ్యాన్ని సరఫరా జరుగుతుందని స్థానికులు చెప్తున్నారు.
అబ్కారీ శాఖ , పోలీస్ అధికారుల మౌనం..!
పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఆబ్కారీ శాఖ, పోలీస్ అధికారులు స్పందించకపోవడం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మౌనం వెనుక మత లాభం ఏమిటి? ఈ దందాలో అధికారులకు వాటా ఎంత ? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఇకనైనా మండలంలోని ఆయా గ్రామాల్లో అక్రమ బెల్ట్ షాపులపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని పల్లెల్లో ప్రశాంతత వాతావరణం కల్పించాలని వివిధ గ్రామాల ప్రజలు మహిళలు అధికారులను కోరుతున్నారు.






