- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నో..నొనో.... పైసలు కొట్టు.. టీసీ పట్టు
దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాలకు చెందిన మనీష్ అనే యువకుడు కొత్త బస్ స్టాండ్ సమీపంలోని...Special story of Private schools and colleges

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాలకు చెందిన మనీష్ అనే యువకుడు కొత్త బస్ స్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మీడియట్ పూర్తి చేశాడు. పై చదువుల నిమిత్తం సర్టిఫికెట్స్ కోసం కళాశాలకు వెళ్లగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తేనే సర్టిఫికెట్స్ ఇస్తాననడంతో డబ్బులు చెల్లించి తీసుకున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరుణ్ అనే విద్యార్థి ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశాడు. ఉన్నత చదువుల నిమిత్తం సర్టిఫికెట్స్ కోసం పాఠశాలకు వెళ్తే రూ. 1000 ఇస్తేనే టీసీ ఇచ్చారు. విద్యార్థుల అవసరాన్ని పసిగట్టిన ప్రైవేటు యజమాన్యాలు టీసీల దందాకు తెరలేపాయి. రూ. 500 నుంచి రూ. 1000 వరకు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విద్యార్థుల అవస్థలు..
ఉన్నత విద్య చదువుదామనుకున్న విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేల రూపాయలు కట్టి చదువు పూర్తి చేసి ఉన్నత చదువుకు వెళ్దామన్న వారికి ప్రైవేట్ యజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
అధికారులు చొరవ చూపాలి..
యజమాన్యాలు డబ్బులు ఇస్తేనే గానీ సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్మీడియట్ ప్రవేశాలతోపాటు ఇంజినీరింగ్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ సమయం కొనసాగుతున్న సందర్భంలో ప్రైవేటు యజమన్యాలు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేయడాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. అధికారులు చొరవ చూపి ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం: నారాయణ, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి
ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థుల కోసం సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు ఎలాంటి ఫీజు చెల్లించవద్దు. అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం.
డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి: జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ అధికారి జగిత్యాల
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించే క్రమంలో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. సర్టిఫికెట్ల పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే విద్యార్థులు నేరుగా విద్యాశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Also Read : టిఫిన్ సెంటర్ యజమాని అకౌంట్లోకి రూ.6 కోట్లు.. దెబ్బకు పరార్..






