Breaking News... సొంత మేనబావకు మళ్లీ షాకిచ్చిన కేటీఆర్...!

by Dishanational2 |
Breaking News... సొంత మేనబావకు మళ్లీ షాకిచ్చిన కేటీఆర్...!
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ లో చిక్కాల రామారావ్ ఒక సీనియర్ లీడర్. సెస్ మాజీ చైర్మన్ గా.. రాజకీయ గుర్తింపు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉంది. కానీ రాజకీయాలు అంతగా కలిసిరాలేదు. సెస్ చైర్మన్ పదవి ముగిశాక.. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 8 ఏళ్లుగా నామినేట్ స్టేట్ పోస్టు కోసం చూసి చూసి, విసిగి వేసారిపోయాడు. ఆఖరకు పద్మనాయక సంక్షేమ మండలి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి.. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నాడు. వాస్తావానికి చిక్కాల టీఆర్ఎస్ కు చేసిన సేవలకు ఎప్పుడో పదవి రావాల్సి ఉండగా.. కొన్ని స్వయంకృతపారదం.. సొంత మండలం తంగళ్లపల్లి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో.. రాజకీయంగా పసగకపోవడం.. కొన్ని తప్పిదాలతో రాజకీయంగా చాలా నష్టం జరిగింది.


చిక్కాల రామారావ్ చేసిన వీటిన్నిటి నుంచి తేరుకోని పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించాక మంత్రి కేటీఆర్ అంత పెద్దగా పట్టించుకోకపోవడంతో చిక్కాల రామారావ్ రాజకీయ భవిష్యత్ అంధకారంలోకి వెళ్లినట్లయింది. ఎలాగు స్టేట్ పోస్టు రాదని తెలిసి.. సెస్ ఎన్నికల బరిలో దిగి సెస్ చైర్మన్ పోస్టు చేపడుదామని.. ముందడుగు వేశాడు. కానీ, కేటీఆర్ మేనభావ చీటి నర్సింగరావ్ కూడా ఆ పదవిపైనే కన్నేసి తాను కూడా తంగళ్లపల్లి మండలం నుంచే పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుని తంగళ్లపల్లి పర్యటనలు, మీటింగ్స్ పెట్టి చిక్కాలకు రాజకీయంగా కంటి నిండా నిద్ర లేకుండా చేశాడు. ఆఖరకు మంత్రి కేటీఆర్ కల్పించుకుని సమస్య సద్దుమనిగించి..మూడవ వ్యక్తికి తంగళ్లపల్లి డైరక్టర్ స్థానం ఇద్దామనకున్న సమయంలో సిరిసిల్ల జిల్లా ముఖ్య నేతలు కల్పించుకుని చిక్కాలకు ఆఖరి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో మంత్రి కేటీఆర్ ఒప్పుకుని సొంత మేనభావను ఒప్పంచి..బుజ్జగించి పోటీ నుంచి తప్పించాడు.

గంభీరావుపేట మండలం నుంచి టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ సొంత అన్న కొండూరి గాంధీరావ్ సైతం చైర్మన్ పదవి కోసం తన ప్యానల్ ను రెడీ చేసుకుని పోటీలో ఉండటానికి రంగం సిద్దం చేసుకోగా సెస్ బరి నుంచి తప్పించేందుకు మంత్రి కేటీఆర్ కొండూరి రవీందర్రావ్ పైనే బాధ్యత పెట్టాడు. సిరిసిల్ల టీఆర్ఎస్ జిల్లా నాయకులు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావ్ కలిసి గాంధీరావుతో రెండు మూడు రోజులుగా చర్చలు జరిపి ఎట్టకేలకు బుధవారం గాంధీరావ్ ను ఒప్పించి సెస్ ఎన్నికల బరిలో పోటీ చేయకుండా తప్పించారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి సెస్ చైర్మన్ పదవి చేపట్టేందుకు చిక్కాల రామారావ్ కు లైన్ క్లీయర్ అయ్యింది. దీంతో బుధవారం చిక్కాల రామారావ్ తంగళ్లపల్లి డైరక్టర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. చిక్కాల రామారావ్ ను గెలిపించుకురావాలని మంత్రి కేటీఆర్ నేరుగా మేనబావ చీటీ నర్సింగరావ్ తోపాటు అసంతృప్తి నాయకులతో సైతం కేటీఆర్ మాట్లాడి వారిని సముధాయించాడు.

నామినేషన్ కేంద్రం వద్దకు చిక్కాలతో అసంతృప్తి నాయకులందరూ వచ్చినప్పటికీ వారంతా ఈ ఎన్నికల్లో సహకరిస్తారా లేదా అనేది రెండో అంశం అయితే.. తంగళ్లపల్లి మండలంలో యూత్ లీడర్ దుబ్బాక రమేశ్ ఆర్థికంగా బాగా ఉన్న వ్యక్తి.. మండలంలో గత కొన్నాళ్లుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించాడు. ఈ సెస్ ఎన్నికల బరిలో తన తండ్రి మల్లయ్యను నామినేషన్ దాఖలు చేయించాడు. దీనికి తోడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ జలగం ప్రవీణ్ కుమార్(టోని)ని నామినేషన్ వేయించగా బీజేపి పార్టీ రాగుల రాజిరెడ్డిని ప్రకటించింది. వీరిని తట్టుకోవడం.. ఇప్పటికే తంగళ్లపల్లి మండలంలో చిక్కాలకు వ్యతిరేఖత ఉండటంతో సెస్ డైరక్టర్ గా బయటపడగలడా...? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తంగళ్లపల్లి సెస్ డైరక్టర్ స్థానంలో చిక్కాల గెలవడంతోపాటు జిల్లాలో మేజార్టీ డైరక్టర్ స్థానాలు టీఆర్ఎస్ ప్యానల్ గెలవాల్సి ఉంది. చిక్కాల రామారావ్ ఎనిమిదేళ్ల రాజకీయ పదవి కల నెరవేరుతుందా..? లేక మరోసారి టీఆర్ఎస్ రాజకీయ గ్రూపు రాజకీయాలకు, అతని వ్యతిరేఖ శక్తులకు బలి పశువుగా మారుతాడా వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా టీఆర్ఎస్ మాత్రం ఈ సెస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి.

Next Story