- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ఆదివారం ప్రైవేట్ కార్యక్రమం కోసం కరీంనగర్‌కు విచ్చేసిన ఆయనకు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇన్‌చార్జి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుపతిరావు, ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయపాల్ రెడ్డి, ఇన్‌చార్జి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దివాకర్ రావు బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అమలు చేస్తున్న పథకాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.






