- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నామినేషన్ల కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
దిశ, జగిత్యాల రూరల్ : జిల్లాలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాయికల్ మండలంలోని ఆలూరు, సారంగాపూర్ మండలంలోని లచక్కపేట గ్రామాల్లోని నామినేషన్

X
దిశ, జగిత్యాల రూరల్ : జిల్లాలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాయికల్ మండలంలోని ఆలూరు, సారంగాపూర్ మండలంలోని లచక్కపేట గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ఉన్నట్లు, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేంద్రాల వద్ద ఉన్న పోలీసులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా 100 మీటర్ల పరిధి నియమాలను పాటించాలని, అనుమతి లేకుండా ఎవరిని అనుమతించరాదని సూచించారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ను ఖచ్చితంగా పాటించాలని స్పష్టంగా హెచ్చరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రఘు చందర్, రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ లు సుదీర్ రావు, గీత సిబ్బంది ఉన్నారు.
Next Story






