- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలి : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలని, కులమతాలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు.

దిశ, గోదావరిఖని : సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలని, కులమతాలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం గోదావరిఖని శారద నగర్, రామగుండం, 4 ఇంక్లైన్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం మనకు సహనం, దానం, సోదరభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు. గోదావరిఖని షాదీ ఖానా కొరకు 2008 సంవత్సరంలో 18 గుంటల భూమి శాంక్షన్ చేయించి సుమారు రూ.46 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మరో రూ.50 లక్షల రూపాయలు విడుదల చేయించడం జరుగుతుందన్నారు.
రామగుండం షాదీఖానా కొరకు రూ 2.00 కోట్ల రూపాయలు ఇచ్చాం. ముస్లిం యువత కోసం ఎలెక్ట్రికల్ స్కూటర్స్, స్టిచ్చింగ్ మిషన్ లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నయని తెలిపారు. తెలంగాణలో ఏ మునిసిపాలిటీలో లేని విధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 6 కార్పొరేటర్ సీట్లు ఇవ్వడం జరిగిందాని అన్నారు. రామగుండం చరిత్ర లోనే మొదటి సారిగా హజ్ కమిటీ మెంబర్ పదవిని ఒక ముస్లిం మహిళకు ఇవ్వడం జరిగిందాని తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో సఖ్యత, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొనాలని ప్రార్థిస్తూ, ఈ పర్వదినం అందరికీ మంచి ఆరోగ్యం, అభివృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.






