- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > సిర్సపల్లి డంప్ యార్డ్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి : కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్
సిర్సపల్లి డంప్ యార్డ్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి : కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్
by Ratna Kumari |
పట్టణ పరిధిలోని సిర్సపల్లి శివారులో నిర్మించతలపెట్టిన డంప్ యార్డ్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు.

X
దిశ, హుజూరాబాద్ : పట్టణ పరిధిలోని సిర్సపల్లి శివారులో నిర్మించతలపెట్టిన డంప్ యార్డ్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని కలిసి దాని వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. ఇతర ప్రాంతాలకు తరలిస్తే.. ఎంత ఉపయోగమో వివరించారు. ఈ ప్రాంతం వ్యవసాయానికి మూలాధారమని.. ప్రజల మనోభావాలు అర్థం చేసుకొని ఈ వేస్ట్ టూ ఎనర్జీ యార్డుతో జనాలతో పాటు వ్యర్థాల వల్ల పంట పొలాలకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. జనవాసాల మధ్య కాకుండా వేరే చోటుకు మార్చాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టిఇక తీసుకెళ్లాలని వేం నరేందర్ రెడ్డిని కోరారు. సానుకూలంగా స్పందించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామి ఇచ్చారు.
Next Story






