- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Siricilla: అక్రమంగా ప్రభుత్వ భూమి పట్టా
సిరిసిల్లలో ప్రభుత్వ భూముల కబ్జాలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

సిరిసిల్లలో ప్రభుత్వ భూముల కబ్జాలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల అక్రమ పట్టా విషయంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు చేసిన భూభాగోతం బహిర్గతం కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చేసిన భూ కబ్జాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కాగా, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా అధికారి ప్రభుత్వ భూమిని కాజేసినట్లు వెలుగులోకి వచ్చింది. 29గుంటల ప్రభుత్వ భూమిని గుట్టుచప్పుడు కాకుండా తన భర్త పేరుపై అక్రమంగా పట్టా చేయించుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా తన స్వగ్రామంలో కూడా కొన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూ కబ్జా విషయంపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇంకా ఆ మహిళ అధికారి ఎక్కడ విధులు నిర్వర్తించినా ఇదే తంతు కొనసాగిస్తుందన్న విమర్శలు లేకపోలేదు. తంగళ్లపల్లి మండలంలో వెలుగులోకి వస్తున్న భూ కబ్జాల వెనుక ఈ అధికారిని పాత్ర కూడా ఉందని మండల వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈలాంటి అధికారిని బీఆర్ఎస్ పార్టీ నాయకుల అండతోనే పదోన్నతులు పొంది, ప్రస్తుతం ఇదే శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా కొనసాగుతున్నట్లు తెలిసింది.
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో ప్రభుత్వ భూముల కబ్జాలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల అక్రమ పట్టా విషయంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు చేసిన భూభాగోతం బహిర్గతం కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చేసిన భూ కబ్జాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కాగా, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా అధికారి ప్రభుత్వ భూమిని కాజేసినట్లు వెలుగులోకి వచ్చింది. 29గుంటల ప్రభుత్వ భూమిని గుట్టుచప్పుడు కాకుండా తన భర్త పేరుపై అక్రమంగా పట్టా చేయించుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా తన స్వగ్రామంలో కూడా కొన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
భర్త పేరుపై ప్రభుత్వ భూమి పట్టా..
అయితే గతంలో జిల్లాలోని తంగల్లపల్లి మండలంలో రెవెన్యూ కార్యాలయ పరిధిలోని ఆయా గ్రామాలకు రెవెన్యూ అధికారిగా ఓ మహిళ విధులు నిర్వర్తించింది. ఈ క్రమంలోనే మండలంలోని మండేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 358లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలుసుకుంది. అప్పటికే మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో అదే అదునుగా భావించిన ఆ మహిళా అధికారి తన భర్త పేరుపై గుట్టు చప్పుడు కాకుండా 29గుంటల ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నట్లు తెలుస్తోంది. అక్రమ పట్టా పొందడానికి అప్పటి రెవెన్యూ అధికారులు ఆ మహిళా అధికారికి సహకరించినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
స్వగ్రామంలో కూడా ఇదే తంతు..
ఇదిలా ఉండగా ఈ మేడం జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోని తన స్వగ్రామంలో కూడా 4ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆమె కుటుంబసభ్యుల పేరుపై కూడా ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేయించినట్లు ఆ గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ భూ కబ్జా విషయంపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇంకా ఆ మహిళ అధికారి ఎక్కడ విధులు నిర్వర్తించినా ఇదే తంతు కొనసాగిస్తుందన్న విమర్శలు లేకపోలేదు. ఆమ్యామ్యాలకు కక్కుర్తిపడి అక్రమార్కులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టడానికి సహకరించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. తంగళ్లపల్లి మండలంలో వెలుగులోకి వస్తున్న భూ కబ్జాల వెనుక ఈ అధికారిని పాత్ర కూడా ఉందని మండల వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈలాంటి అధికారిని బీఆర్ఎస్ పార్టీ నాయకుల అండతోనే పదోన్నతులు పొంది, ప్రస్తుతం ఇదే శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా కొనసాగుతున్నట్లు తెలిసింది.
విచారణ జరుపుతాం..
మండేపల్లి గ్రామంలోని 358 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి కబ్జా అయినట్లు తమ దృష్టికి రాలేదు. సర్వేయర్‌తో భూమిని సర్వే చేయించి అధికారులతో సమగ్ర విచారణ జరిపిస్తాం. అనంతరం నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా అధికారులు భూ కబ్జాకు పాల్పడినట్లు తేలితే శాఖా పరమైన చర్యలు కూడా తీసుకుంటామని తంగళ్లపల్లి తహశీల్దార్ జయంత్ తెలిపారు.






