- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిరిసిల్ల చైర్ పర్సన్ పీఠం జిందం కళకే
సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం మరోసారి జిందం కళ చక్రపాణికే దక్కింది. సిరిసిల్ల మున్సిపల్ లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండోసారి జిందం కళ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు.

దిశ, తంగళ్లపల్లి : సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం మరోసారి జిందం కళ చక్రపాణికే దక్కింది. సిరిసిల్ల మున్సిపల్ లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండోసారి జిందం కళ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ యువనేత దార్ల సందీప్ కు వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించారు. వరుసగా రెండోసారి సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన జిందం కళ చక్రపాణికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు సహకారంతో సిరిసిల్ల మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరవేశామని, ఇదే స్ఫూర్తితో పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చైర్పర్సన్ స్పష్టం చేశారు.
అలకబూనిన సీనియర్ నేత..
బీఆర్ఎస్ పార్టీ నుంచి 14వ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన బుర్ర నారాయణ తనకు వైస్ చైర్మన్ గా అవకాశం ఇస్తామని చెప్పి తీరా ఎన్నిక సమయంలో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపాడు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలా మిగతా వారికి అన్యాయం చేయవద్దని మండిపడ్డారు. ముందు జాబితాలో తన పేరు ఉందని, చివరి నిమిషంలో తొలగించినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.






