చోరీ కేసు ఛేదించిన సిరిసిల్ల పోలీసులు.. వ్యక్తి అరెస్టు, రిమాండ్ కు తరలింపు

by Bhanu |

సీసీ కెమెరాల ఆధారంగా పది రోజుల్లోనే చోరీ కేసును సిరిసిల్ల పోలీసులు ఛేదించారు. కరీ

చోరీ కేసు ఛేదించిన సిరిసిల్ల పోలీసులు.. వ్యక్తి అరెస్టు, రిమాండ్ కు తరలింపు
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: సీసీ కెమెరాల ఆధారంగా పది రోజుల్లోనే చోరీ కేసును సిరిసిల్ల పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలోని బోయినిపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన కొమురయ్య ఈ నెల 12న తన భార్య తో కలసి సిద్దిపేటకి వెళ్తుండగా సిరిసిల్ల బస్ స్టాండ్ లో తన భార్య హాండ్ బ్యాగ్ లో నుండి బంగారు నల్ల పూసల తాడు, ఒక జత బంగారు చెవుల కమ్మలు, బంగారు వంక ఉంగరం, ఒక బంగారు చైన్ లను గుర్తు తెలియని వ్యక్తి దొంగలించారని సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో కొమురయ్య ఇచ్చారు.

ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. బస్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామానికి చెందిన వేల్పుల రాజేశ్వర్ రెడ్డిని పట్టణంలోని పెద్ద బజారులో అదుపులోకి తీసుకొని, అతని వద్ద 48.47 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పట్టణ సీఐ వెల్లడించారు.

Next Story