- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిసి రోడ్, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు
హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బుధవారం రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావును సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, సిరిసిల్ల రూరల్ : హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బుధవారం రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావును సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. వారు మంత్రికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం సిరిసిల్ల సర్దాపూర్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనానికి అవసరమైన సీసీ రోడ్, కాంపౌండ్ వాల్ నిర్మాణ నిధుల విషయాన్ని మంత్రికి వివరించారు. ఈ ప్రతిపాదనపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు సానుకూలంగా స్పందించి, సీసీ రోడ్ నిర్మాణానికి రూ.1 కోటి 30 లక్షలు, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.1 కోటి నిధులు మంజూరు చేసినట్లు చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలకు మార్కెట్ కమిటీ తరఫున చైర్ పర్సన్ స్వరూప కృతజ్ఞతలు తెలిపారు.






