బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

by velandi.Saikiran |

సుందిళ్ళ ప్రధాన రహదారి పై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో సింగరేణి కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి.

బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
X

దిశ, యైటింక్లయిన్ కాలనీ: రామగిరి మండలం సుందిళ్ళ ప్రధాన రహదారి పై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో సింగరేణి కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన కోట ప్రదీప్ కుమార్ సింగరేణి సంస్థ అడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో జనరల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజువారీగా తన బైక్ పై మంచిర్యాల నుంచి విధులకు వస్తున్న క్రమంలో సుందిళ్ళ వద్ద రహదారి పై మంథని నుంచి గోదావరిఖని వైపు అతివేగంగా వెళుతున్న‌ ఆర్టీసీ బస్సు, బైకును ఢీ కొట్టింది. దీంతో ప్రదీప్ కు తీవ్ర‌ గాయాలయ్యాయి. ఇక‌ ప్రదీప్ సోదరుడు కోట ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ సీఐ-2 ఎస్.లింగమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story