కోల్ ఇండియా తరహాలో వేతనాలు చెల్లించాలని సింగరేణి అధికారుల నిరసన..

by Kodari Anjali |

కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సీఎంఓఏ) ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి వ్యాప్తంగా అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

కోల్ ఇండియా తరహాలో వేతనాలు చెల్లించాలని సింగరేణి అధికారుల నిరసన..
X

దిశ, గోదావరిఖని: కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా సింగరేణి అధికారులకు కూడా జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సీఎంఓఏ) ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి వ్యాప్తంగా అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఓసీపీ-3 గనిపై అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంఓఏ నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి అధికారులకు రావాల్సిన వేతన సవరణలు, జీతభత్యాల విషయంలో పలుమార్లు విజ్ఞప్తులు, నిరసనలు చేపట్టినప్పటికీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరిగేంత వరకు రోజు వినూత్న రీతిలో పోరాటాలు చేస్తామని అన్నారు. కోల్ ఇండియా అధికారులకు అందుతున్న వేతనాలు, ప్రయోజనాలతో సమానంగా సింగరేణి అధికారులకు కూడా న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సంస్థ అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సింగరేణిలో అధికారులకే న్యాయం జరగకపోతే సాధారణ కార్మికుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? అని ప్రశ్నించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎంఓఏ నాయకులు పాల నరేష్, సుగుణాకర్, యశ్వంత్, శ్రావణ్, పాషా, సాంబమూర్తి, అస్లాం, మధుకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Next Story