SIR పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. సొంత నేతలపై రేవంత్ రెడ్డి సీరియస్

by Prasad Jukanti |   (  Updated:2026-06-24 06:23:16  IST  )

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, వారం రోజుల్లో పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

SIR పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. సొంత నేతలపై రేవంత్ రెడ్డి సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ లు మరింత అప్రమ‌త్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎస్ఐఆర్ అనేది అత్యంత సీరియస్ అంశమని, ఇందులో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఎస్ఐఆర్ ప్రక్రియపై వర్చువల్‍గా భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ నేతలు మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొంద‌రు నాయ‌కులు స‌ర్ పైన నిర్లక్ష్యంగా ఉంటున్నారని పార్టీ కోసం పని చేయకపోతే మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

జిల్లాల వారీగా నా దగ్గర రిపోర్టు ఉంది:

స‌ర్ అవ‌గాహ‌న స‌ద‌స్సుల‌పైన జిల్లాల వారీగా నా ద‌గ్గర‌ రిపొర్ట్ ఉందని జిల్లాల వారీగా మేం చూడటం లేదనుకుంటున్నారు. కానీ మేం అన్నీ నోట్ చేసుకుంటున్నామని సీఎం చెప్పారు. ఆదిలాబాద్‍లో బీఆర్ఎస్ 4 సమావేశాలు పెడితే కాంగ్రెస్ 3 సమావేశాలే ఏర్పాటు చేసిందని, కొత్తగూడెంలో బీజేపీ 8 సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. బీజేపీ నామమాత్రంగా ఉన్నా సమావేశాలు పెట్టిందని, ఓట్లు తొలగించే పార్టీ 160 సమావేశాలు పెడితే అధికారంలో ఉన్న మనం వెనుకబడి ఉన్నామని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ త‌రుపున స‌ర్ పైన అవ‌గాహ‌న స‌ద‌స్సులు మ‌రిన్ని జ‌ర‌గాలని సూచించారు. ఎస్ఐఆర్ విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే సమాజంలోని పేద ప్రజలకు భారీ అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పేద‌ల ఓట్లు పోతే వాళ్ల ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు పోతుందని వాళ్లకు అన్యాయం జ‌ర‌గ‌నివ్వొద్దన్నారు.

పది రోజులే గడువు.. మారకపోతే మార్చేస్తాం!

స‌ర్ పైన ఇంఛార్జీ మంత్రుల మ‌రింత బాధ్యతాయుతంగా వ్యవ‌హారించాలని పార్టీ ఆదేశాల‌ను ఎవ‌రైనా పాటించాల్సిందేనన్నారు. సఈ విష‌యంలో నిర్లక్ష్యంగా వ్యవహ‌రించే వారిని క్షమించబోమని ప‌ని చేయ‌కుండా పార్టీకి న‌ష్టం క‌ల్గిస్తామంటే చూస్తు ఉర్కొమన్నారు. ప‌ది రోజుల స‌మ‌యం ఇచ్చి చూస్తామని పార్టీ ఆదేశాల‌ను ప‌ట్టించుకోని గుర్తించి వారి స్థానంలో మ‌రొక ఇంఛార్జ్ ని నియ‌మిస్తామని స్పష్టం చేశారు. పార్టీ స‌ర్పంచ్‍ల‌తో స‌ర్ పైన గ్రామాల్లో ప్రచారం చేయించి అవ‌గాహ‌న క‌ల్పించాలన్నారు.

Next Story