- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిచ్చికుక్కలు స్వైర విహారం.. పది మందిపై దాడి
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన బాధితులు జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దిశ, వెల్గటూర్: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుడిసెలపేట గ్రామంలో బుధవారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. పది మందిపై పిచ్చి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వీరిలో పిచ్చికుక్క దాడి ఘటనలో ముఖంపై తీవ్ర గాయాలైన ఓ మహిళా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా గ్రామంలో ఉదయమే రెండు పిచ్చి కుక్కలు ప్రజలపై దాడి చేయగా.. గ్రామస్తులు వాటిలో ఒక కుక్కను పట్టుకుని చంపేయగా.. మరొకటి తప్పించుకొని పారిపోయినట్లు తెలిసింది. అయితే పారిపోయిన పిచ్చికుక్క ఎప్పుడు ఈ దిశ నుంచి వచ్చి దాడి చేస్తుందో అని గ్రామస్థులు తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చికుక్కల దాడిలో గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్‌లో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా అధికారులు తక్షణమే స్పందించి తప్పించుకుని పారిపోయిన కుక్కను కూడా పట్టుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.






