- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'దిశ' ఎఫెక్ట్.. రెండేళ్లుగా విధులకు డుమ్మా..!
సొంతూరు హైదరాబాద్.. విధి నిర్వహణ మాత్రం హుజూరాబాద్ లో.. రెండు సంవత్సరాలు ఆ పరిసన ప్రాంతాల్లో కనిపించకుండా విధులకు గైర్హాజరవుతూ ప్రభుత్వ వేతనం పొందుతున్న ఫార్మసిస్ట్ ఉదంతం పై ఎట్టకేలకు అధికారులు కదిలారు.

దిశ, హుజూరాబాద్ రూరల్ : సొంతూరు హైదరాబాద్.. విధి నిర్వహణ మాత్రం హుజూరాబాద్ లో.. రెండు సంవత్సరాలు ఆ పరిసన ప్రాంతాల్లో కనిపించకుండా విధులకు గైర్హాజరవుతూ ప్రభుత్వ వేతనం పొందుతున్న ఫార్మసిస్ట్ ఉదంతం పై ఎట్టకేలకు అధికారులు కదిలారు. ఏప్రిల్ 10న దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యారోగ్య శాఖ స్పందించింది.
అధికారులను మేనేజ్ చేస్తూ..
రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమం విభాగంలో (RBSK )హుజూరాబాద్ టీమ్-ఏలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్న బండ శ్వేతా రెడ్డి, గత రెండేళ్లుగా విధులకు గైర్హాజరవుతున్నారు. తన తండ్రి పోలీస్ శాఖలో పని చేస్తుండటాన్ని అడ్డం పెట్టుకుని, తనపై ఫిర్యాదు చేసిన తోటి సిబ్బందిని బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఉన్నతాధికారులను సైతం మేనేజ్ చేస్తూ విధులకు రాకుండానే వేతనం పొందుతున్న తీరుపై తోటి ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
'దిశ' కథనంతో కదిలిన యంత్రాంగం..
ఈ అక్రమాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా విచారణలో జాప్యం జరగడంతో 'దిశ' పత్రిక ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. జిల్లా ఆర్బీఎస్‌కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ రెడ్డి, హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు.
ఎట్టకేలకు షోకాజ్ నోటీసు జారీ..
విచారణ అనంతరం గోప్యత పాటించిన అధికారులు, ఎట్టకేలకు సదరు ఫార్మసిస్ట్‌పై చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు శ్వేతా రెడ్డికి షోకాజ్ నోటీసు (Rc No: E3/517/2026, తేదీ: 29 ఏప్రిల్ 2026) జారీ చేశారు. రెండేళ్ల పాటు విధులకు హాజరు కాకుండా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని తోటి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. తమ గోడును వినిపించి, అధికారుల్లో చలనం తెచ్చిన 'దిశ' పత్రికకు వారు కృతజ్ఞతలు తెలిపారు.






