- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్ తో గొర్రెల కాపరి, రెండు మేకలు మృతి
విద్యుత్ షాక్ తో గొర్రెల కాపరితో పాటు రెండు మేకలు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, హుజూరాబాద్ : విద్యుత్ షాక్ తో గొర్రెల కాపరితో పాటు రెండు మేకలు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేట గ్రామానికి చెందిన బోల్లి సమ్మయ్య (52) గొర్రెల కాపరి. ప్రతి రోజు మాదిరిగానే మంగళవారం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. అయితే సర్వాయిపేట శివారులో మేపుతుండగా మాందాపూర్ గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద కోతుల బెడద నుండి రక్షించుకునేందుకు పంట చుట్టూ విద్యుత్తు తీగలను అమర్చారు. వాటికి విద్యుత్ షాక్ ఏర్పాటు చేయడంతో అది గమనించకుండా వెళ్లిన గొర్రెల కాపరి సమ్మయ్యతో పాటు రెండు మేకలు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ విషయాన్ని పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.






