పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు జరగకుండా చూడాలి : జిల్లా సంక్షేమ అధికారి పీ.లక్ష్మీరాజ్యం

by Nallavelli.Anjaneyulu |

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు జరగకుండా చూడాలని జిల్లా సంక్షేమ అధికారి పీ.లక్ష్మీరాజ్యం సూచించారు. శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు జరగకుండా చూడాలి : జిల్లా సంక్షేమ అధికారి పీ.లక్ష్మీరాజ్యం
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు జరగకుండా చూడాలని జిల్లా సంక్షేమ అధికారి పీ.లక్ష్మీరాజ్యం సూచించారు. శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అపరెల్ పార్కులోని పంక్చుయేట్ వరల్డ్ ప్రయివేట్ లిమిటెడ్ కంపనీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ఆవరణలో అంతర్గత కమిటీ పనితీరును పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రయోజనాలు, పని ప్రదేశంలోఉన్న స్థితిగతులపై ఆరా తీశారు. అలాగే మేనేజ్మెంట్ సభ్యులతో మాట్లాడి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి పని ప్రదేశాల్లో ఇంటర్నల్ కమిటీ అంతర్గత కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక వాతావరణంలో పని ప్రదేశం ఉండాలని తెలిపారు. పని ప్రదేశంలో సరైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు మానసిక ఉల్లాసానికి చర్యలు చేపట్టాలన్నారు. క్రచ్ పిల్లల డేకేర్ సెంటర్ లో పిల్లలకి అందుతున్న సేవలను పరిశీలించారు.

Next Story