గడువు ముగిసిన కూల్ డ్రింక్స్ అమ్మకం.. కంగుతిన్న కస్టమర్స్

by Batti.Sumithra |   (  Updated:2025-04-20 12:39:18  IST  )

గడువు ముగిసిన కూల్ డ్రింక్స్ కొనుగోలు చేసి కస్టమర్లు కంగుతిన్న సంఘటన వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో చోటు చేసుకుంది.

గడువు ముగిసిన కూల్ డ్రింక్స్ అమ్మకం.. కంగుతిన్న కస్టమర్స్
X

దిశ, వేములవాడ టౌన్ : గడువు ముగిసిన కూల్ డ్రింక్స్ కొనుగోలు చేసి కస్టమర్లు కంగుతిన్న సంఘటన వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే వేములవాడ - సిరిసిల్ల ప్రధాన రహదారిలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న ఓ బేకరిలో కొంత మంది వ్యక్తులు కూల్ డ్రింక్ కొనుగోలు చేసి తాగేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బాటిల్ పై ఉన్న తేదీలను గమనించగా ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసినట్లు కనిపించింది.

దీంతో కంగుతిన్న కస్టమర్లు ఇదేంటని దుకాణ యజమానిని ప్రశ్నించగా ఆయన దురుసుగా ప్రవర్తించి, గొడవకు దిగినట్లు తెలిసింది. అయితే ఏది ఏమైనా జిల్లాలో ఆహార తనిఖీలు నిరంతరం జరగకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి జిల్లాలోని ఆహార పదార్థాలకు సంబంధించిన దుకాణాలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Next Story