- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనర్హుల చేతుల నుంచి సర్కారు భూములు స్వాధీనం చేసుకోండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనర్హులైన కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా వారి నుంచి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

దిశ, ధర్మారం : పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అనర్హులైన కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా వారి నుంచి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఇంటింటికి సోలార్ పథకం పై జరిగిన అవగాహన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారం మండలంలోని నర్సింగాపూర్, ఖీలావనపర్తి , ధర్మారం గ్రామంలో కొందరు భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి పట్టాలు రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ భూములను అర్హులైన పేదలకు అందజేస్తామని తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలో క్రీడా మైదానం కొరకు కేటాయించిన స్థలాన్ని 15 రోజుల్లో చదును చేసి క్రికెట్, వాలీబాల్ ,వాకింగ్ ట్రాక్ కు అనుగుణంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులకు సూచించారు. రాజకీయంగా జన్మనిచ్చిన ధర్మారం మండలం పై ప్రత్యేక ప్రేమ ఉంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.ప్రభుత్వం అందజేస్తున్న సోలార్ పథకాన్ని నంది మేడారం గ్రామస్తులు 100 శాతం ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చోరవతో మేడారం గ్రామం 100శాతం సోలార్ గ్రామంలో ఎంపిక అయిందని మంత్రి వివరించారు. గ్రామంలో తొలి విడతలో గృహ అవసరాలకు 1486 విద్యుత్ కనెక్షన్లకు రెండు కిలో వాట్స్ సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో 628 కరెంట్ వ్యవసాయ పెంపు సెట్లకు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మేడారం గ్రామాన్ని 100 శాతం సోలార్ వినియోగం గ్రామంగా మార్చడానికి ప్రభుత్వం రూ. 51 కోట్లు విడుదల చేసిందని మంత్రి తెలిపారు.గ్రామంలో విద్యుత్ లైన్ల మార్పిడి కోసం రూ. 36 లక్షలు కేటాయించడం మంత్రి వివరించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా బోర్ బావులు తవ్వించామని 80 మందికి మేడారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.






