కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ : మంత్రి సీతక్క

by Bhanu |

కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు.

కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ : మంత్రి సీతక్క
X

దిశ, పెగడపల్లి : కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ధర్మపురి నియోజకవర్గం లోని పెగడపల్లి మండలంలో పర్యటించిన సీతక్క 20 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి మరో 30 కోట్ల నిధులు మంజూరు చేసేందుదకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గాలను సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేస్తామన్నారు.రాబోయే రోజుల్లో గిరిజన తండా లో రోడ్ల నిర్మాణం కు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఎన్నో సమస్యలను తట్టుకొని ఎమ్మెల్యేగా గెలుపొందిన లక్ష్మణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరచాలని సూచించారు. సమావేశం అనంతరం నరసింహునిపేట గ్రామంలో దళితవాడలో స్థానిక ప్రజలతో కలిసి మంత్రి సహాపంక్తి భోజనం చేశారు.


గెలిచిన ఓడిన ప్రజల్లోనే ఉన్నా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయం లో ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి దూరంగా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. తలాపునే గోదారి ఉన్న ధర్మపురి ప్రజలకు చుక్కనీరు దొరికే పరిస్థితి లేదన్నారు. ఇక్కడి నీళ్లను కేసీఆర్ తరలించకపోతే మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. 2018లో తాను గెలిచిన ఓడినట్లు కోర్టుల చుట్టూ కెసిఆర్ కోర్టుల చుట్టూ తిప్పారని ఆరోపించారు. గెలిచిన ఓడిన ప్రజల మధ్యనే ఉన్నానని కాబట్టే ప్రజలు గెలిపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ వంశి క్రిష్ణ,రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్,జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఆడిసనల్ కలెక్టర్ గౌతం రెడ్డి,డి ఆర్ డి ఓ రఘువరన్,జిల్లా సంక్షేమ అధికారి నరేష్,ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి,తహశీల్దార్ రవీందర్,జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కటారి చంద్ర శేఖర్ రావు,మాజీ జెడ్పీటీసీ లు తాటిపర్తి శోభా రాణి,తోట మోహన్ రెడ్డి,రాజేందర్ రావు,మాజీ సర్పంచ్ లు తాటిపర్తి ప్రభాకర్ రెడ్డి,రవి నాయక్,మల్లా రెడ్డి,నాయకులు సంధి మల్లారెడ్డి, కడారి తిరుపతి,పురుషోత్తమ అనిల్ గౌడ్,కుంచె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story