కొండగట్టు హనుమాన్ జయంతికి పటిష్ట భద్రత

by Ratna Kumari |

జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా 950 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

కొండగట్టు హనుమాన్ జయంతికి పటిష్ట భద్రత
X
దిశ, కొండగట్టు : జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా 950 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం జేఎన్‌టీయూ కళాశాలలో నిర్వహించిన బ్రీఫింగ్‌లో ఆయన మాట్లాడుతూ బందోబస్తును 6 సెక్టార్లుగా విభజించి, 3 షిఫ్టుల్లో విధులు కేటాయించినట్లు చెప్పారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, దేవస్థానం, క్యూ లైన్లు, మాల విరమణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాలినడకన వచ్చే దీక్ష భక్తులకు రేడియం స్టిక్కర్లు పంపిణీ చేసి జాగ్రత్తలు సూచించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Next Story