ఐదేళ్లుగా మారని సమస్య.. విద్యార్థుల కష్టాలపై కళ్లు మూసుకున్న విద్యాశాఖ.!

by Bhanu |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని దోసల గూడెం కాలనీలోని అంగన్వాడి కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో

ఐదేళ్లుగా మారని సమస్య.. విద్యార్థుల కష్టాలపై కళ్లు మూసుకున్న విద్యాశాఖ.!
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని దోసల గూడెం కాలనీలోని అంగన్వాడి కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ లోకి వెళ్లాలన్న మూలుగు నీళ్లలో నుంచి నడవాల్సిందే. మురుగు నీళ్ళల్లో నడవడం వల్ల విద్యార్థులకు ఎలర్జీ ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే పాఠశాలలో చదువుకుని విద్యార్థులు ఈ బాధ పడాల్సిందే.

అసలే ప్రభుత్వ పాఠశాల ఇందులో ఈ పాఠశాలకు సరైన దారి లేదు. రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న విద్యాశాఖ అధికారులు కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పాఠశాలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

గత ఐదు ఏళ్ల నుంచి మండల విద్యాశాఖ అధికారులకు నీరు నిలుస్తున్న విషయం తెలిసినప్పటికీ ఐదేళ్ల నుంచి మురుగునీటి సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోని పాఠశాల సమస్యలను తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Next Story