- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిసార్ట్స్ పేరుతో దందా.. ఫిర్యాదులు అందినా పట్టించుకోని అధికారులు
పచ్చని పంట పొలాల మధ్య చిన్నారుల జీవితాలు చిత్తుగా మారుతున్నాయి. డీజే సౌండ్స్ తో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లుతుంటే మద్యం మత్తులో మైనర్ బాలురు చిందులేస్తున్నారు.

దిశ బ్యూరో, కరీంనగర్ : పచ్చని పంట పొలాల మధ్య చిన్నారుల జీవితాలు చిత్తుగా మారుతున్నాయి. డీజే సౌండ్స్ తో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లుతుంటే మద్యం మత్తులో మైనర్ బాలురు చిందులేస్తున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా రిసార్ట్స్ నిర్వాహకులు నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ వయో భేదం లేకుండా రిసార్ట్స్ అప్పగిస్తున్నారు. రిసార్ట్ ఊరు చివర గుట్టప్రాంతం లో ఉండటం చేత అక్రమ వ్యవహారాలకు వేదికగా మార్చుకుంటున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ దందాలు, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నిత్యం పంట పొలాల మధ్య డీజే సౌండ్స్, మద్యం మత్తులో వేసే కేరింతలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతుంది
పల్లెల్లో పట్టణ పోకడలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జిల్లా కేంద్రానికి సమీపాన ఉండటం అందులో రాష్ట్రా రాజధానికి వెళ్లే హైవే రహదారి ఈ మండల కేంద్రం మీదుగా వెల్లడం తో ఇక్కడ పట్టణ పోకడలకు ఈ మండలం వేదికగా మారుతుంది. దీంతో అడ్డగోలు వెంచర్లు, అక్రమ నిర్మాణాలకు ఈ మండలం వేదికవుతుంది. వెంచర్ నిర్వాహకులకు లాభాలు సైతం అదే స్థాయిలో రావడంతో అదే స్థాయిలో ఖర్చుపెట్టి నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.దీంతో నిబంధనలకు విరుద్ధంగా రిసార్ట్స్ ను ఏర్పాటు చేస్తున్నా కొందరు నిర్వాహకులు అక్రమ వ్యవహారాలకు వాటిని అడ్డగా మారుస్తున్నారనే సమాచారం. అందుకు నల్లగొండ గ్రామంలో నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన రిసార్ట్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. రిసార్ట్ నిర్వాహకులు ఆ రిసార్ట్ ను పబ్బులా మార్చి వ్యాపారం సాగిస్తున్నారు అని స్థానికంగా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించు కోకపోవడంతో నిర్వాహకుల అక్రమ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా విలసిల్లుతుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి
ఫామ్ లాండ్ లో నిర్మాణాలు
పంచని పంట పొలాల మధ్య గుట్ట అంచున ఖరీదైన చెట్లను పెంచి లాభాలను పంచుతామని ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి గాయత్రి ఫామ్ లాండ్ నిర్వాహకులు అక్రమ కార్యకలాపాలకు అడ్డగా మార్చారు. మొక్కలు పెంచాల్సిన నిర్వాహకులు అది విస్మరించడంతో అందులో ప్లాట్లు కోనుగోలు చేసినవారు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్చుకున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి
రిసార్ట్ లను నెలకొల్పుతున్నారు. దీంతో పట్టణ పోకడలు పల్లెలకు పాకుతుండగా రిసార్ట్ నిర్వాహకులు వయో బేదం లేకుండా రిసార్ట్ ను మైనర్ లకు అప్పగించడంతో ఆ ప్రాంతంలో ని కొంతమంది చిన్నారులు అదే స్టేటస్ గా భావించి అక్కడ విందుల పేరిట అద్దెకు తీసుకుని మద్యం మత్తులో డీజే సౌండ్స్ మధ్య చిందులేస్తున్నారు .ప్రస్తుతం పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ను కూడా నిర్వాహకులు ఉల్లంఘిస్తుండటంతో ఆ ప్రాంతం డీజే సౌండ్స్ తో దద్దరిల్లుతుండగా యువత మద్యం మత్తులో చిందులేస్తూ పట్టణాల్లోని పబ్బులను తలపిస్తున్నారు
ఫామ్ లాండ్ లో నిబందనలకు పాతర
నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ లాండ్ ఏర్పాటు చేసి ఆ స్థలాల్లో అక్రమ వ్యవహారాలు సాగిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం వారికి దాసోహం అన్నట్టుగా వ్యవహరిస్తుంది. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే ఆ ఫామ్ లాండ్ లో ఎక్కువ శాతం ప్లాట్లు ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల సహాయకులు కోనుగోలు చేయడమే ఇందుకు కారణం అనేది స్థానికంగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం .అంతేకాకుండా జిల్లా డివిజన్ స్థాయి ఉద్యోగులు కావడం చేత గ్రామ మండల స్థాయి అధికారులు ఎవరు కూడా అటు వైపు కన్నెత్తి చూడలేకపోతున్నారు. దీంతో అక్కడ నిబంధనలు యథేచ్ఛగా పాతరేయబడుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.






