- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని, హుజురాబాద్ పట్టణంలోని పాటిమీది ఆంజనేయస్వామి ఆలయం

దిశ, హుజురాబాద్ రూరల్ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని, హుజురాబాద్ పట్టణంలోని పాటిమీది ఆంజనేయస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. శుభప్రదమైన ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో హాజరై సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించడం వలన సర్వశుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు.
భక్తులు తమ ఇళ్ల నుండి పూజా ద్రవ్యాలను తెచ్చుకొని, అత్యంత భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. ఈ సామూహిక వ్రతంలో దంపతులు తమ కుటుంబ సభ్యులతో సహా వేదికపై ఆసీనులై, పవిత్రమైన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పారాయణం, కథా శ్రవణం, మంగళ హారతులతో ఆలయ ప్రాంగణం దైవ నామస్మరణతో మార్మోగింది. పూజ అనంతరం భక్తులందరూ స్వామివారికి పండ్లు పాయసం నైవేద్యాలను సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ దంపతులు కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్రతంలో పాల్గొనేందుకు మరియు స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో హాజరవడం విశేషం. సత్యనారాయణ స్వామి వ్రతం ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులందరూ ఈ అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.






