కేటీఆర్ ను ఆత్మీయ అలింగ‌నం చేసుకున్న వృద్దురాలు స‌త్త‌వ్వ

by Ratna Kumari |   (  Updated:2026-03-27 09:39:44  IST  )

ఎల్లారెడ్డి పేట మండలంలోని బొప్పాపూర్, గొల్లపల్లి గ్రామాలలోని మూడుగుల్ల ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను గొల్లపల్లి కి చెందిన ప్యారామ్ సత్తవ్వ అనే వృద్ధురాలు కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకుంది.

కేటీఆర్ ను ఆత్మీయ అలింగ‌నం చేసుకున్న వృద్దురాలు స‌త్త‌వ్వ
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డి పేట మండలంలోని బొప్పాపూర్, గొల్లపల్లి గ్రామాలలోని మూడుగుల్ల ఆలయంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను గొల్లపల్లి కి చెందిన ప్యారామ్ సత్తవ్వ అనే వృద్ధురాలు కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకుంది. ఆలయంలో చాలా రోజుల తర్వాత కలిసిన కేటీఆర్ తో ఆమె మనసులోని వేదనను వ్యక్తం చేసింది. "మీరు బాగుండాలి,పెద్దాయన కేసీఆర్ సార్ బాగుండాలి" అంటూ కేటీఆర్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ వృద్ధురాలు మాట్లాడిన మాటలు అక్కడున్న అందరిని ఆకర్షించాయి. కేటీఆర్ ఆలయంలోకి విచ్చేసిన సందర్భంగా ఆయనతో BRS నాయకులు, కార్యకర్తలు, పిల్లలు,పెద్దలు సెల్ఫీ లు దిగుతూ కేటీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో గత అనేక ఏళ్లుగా సిరిసిల్ల నియోజక వర్గానికి ప్రాతి నిద్యం వహిస్తూ నియోజక వర్గ అభివృద్ధికి కేటీఆర్ చేసిన సేవలకు ఈ సంఘటనే నిదర్శనంగా భావించవచ్చు.

Next Story