- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ లు బ్రిడ్జి మీద ఉన్న తపన డబుల్ రోడ్డు మీద చూపించాలి
సర్పంచ్ లు బ్రిడ్జి మీద ఉన్న తపన డబుల్ రోడ్డు మీద చూపించాలని బీఆర్ఎస్ విభాగం నియోజవకర్గ అధ్యక్షుడు గూడురు సురేష్ తెలిపారు.

దిశ, గన్నేరువరం : మండలంలో నూతనంగా ఎన్నికైన వివిధ గ్రామాల సర్పంచులు మానేరు నదిపై మైలారం నుంచి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చూపిస్తున్న తపన డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టడంపై చూపించాలని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరు సురేష్ ఎద్దేవా చేశారు. గురువారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ డబుల్ రోడ్డు నిర్మాణం జరగక ప్రజలంతా అవస్థలు పడుతుంటే.. కొత్తగా ఏర్పడిన సర్పంచులు రోడ్డు సమస్యను పక్కన పెట్టి గన్నేరువరం నుంచి నిర్మించాల్సిన బ్రిడ్జిని మైలారం నుండి నిర్మించాలని కోరుతూ తీర్మానాలు ఇవ్వడం ఆర్అండ్ బి ఈ ఈ కి వినతి పత్రాలు అందజేయడం సోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది కుట్రపూరితంగానే గన్నేరువరం మండల కేంద్రం అభివృద్ధిలో భాగమైన బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని అన్నారు. సర్పంచులు ఏ ఒక్కరు గ్రామాలలో బ్రిడ్జి నిర్మాణానికి కై గ్రామసభలు నిర్వహించలేదని.. ఇష్టం వచ్చినట్లు తీర్మానాలు చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని మైలారం లో జరిగే విధంగా చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సర్పంచులు కళ్ళు తెరిచి ప్రధాన సమస్య అయిన డబుల్ రోడ్డుపై దృష్టి సారించి రోడ్డు పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గన్నేరువరం నుంచి బ్రిడ్జి నిర్మాణం జరిగేలా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. డబుల్ రోడ్డు పనులు చేపట్టకుంటే త్వరలోనే యువజన సంఘాల సమైక్యతతో మరో ఉద్యమం ప్రారంభం కాబోతుందని హెచ్చరించారు.






