- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వేములవాడ టౌన్: తనపై అకారణంగా దాడి చేసిన సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ గ్రామపంచాయతీ స్వీపర్ వేములవాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామపంచాయతీలో మల్యాల మల్లయ్య స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా గ్రామ సర్పంచ్ సంద్రగిరి లక్ష్మీ భర్త చంద్రయ్య తాను చేస్తున్న కాంట్రాక్టు పనుల్లో పనిచేయాలని మల్లయ్యను బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితుడు తెలిపాడు. దీనికి నిరాకరించడంతో కోపోద్రిక్తుడై మంగళవారం ఉదయం తనపై సర్పంచ్ భర్త చంద్రయ్య గ్రామ హోటల్ సమీపంలో దాడిచేశాడని అన్నారు. దీంతో దాడి చేసిన సర్పంచ్ భర్త చంద్రయ్యపై చర్యలు తీసుకోవాలని వేములవాడ రూరల్ ఎస్ఐ నాగరాజుకు మల్లయ్య ఫిర్యాదు చేశాడు.
Next Story






