ఆ స‌ర్పంచ్ రూటే స‌ప 'రేటు'

by Ratna Kumari |

శంకరపట్నం మండలంలోని ఓ గ్రామపంచాయతీ పాలకవర్గంలో అప్పుడే లుకలుకలు మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ స‌ర్పంచ్ రూటే స‌ప రేటు
X

దిశ‌, శంక‌ర‌ప‌ట్నం : శంకరపట్నం మండలంలోని ఓ గ్రామపంచాయతీ పాలకవర్గంలో అప్పుడే లుకలుకలు మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ ఒంటెద్దు పోకడ పోతున్నట్టు ప్రజల తో పాటు పాలకవర్గం మండిపడుతున్నారు. ముఖ్యంగా 20 రోజుల్లో సర్పంచ్ పదవీ ని సాధించుకున్న నేను మీరు చెబితే వినాలా? అనే రీతిలో సదరు సర్పంచ్ ప్రవర్తన ఉందని వార్డు సభ్యులను ఎవరిని లెక్క చేయడం లేదని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా సర్పంచ్ కి చెప్పే సాహసం ఎవరు చేయలేక లోలోపలే పాలకవర్గ సభ్యులు అంతఃర్మధనం చెందుతున్నట్లు సమాచారం. పని నాదే పైసలు నాకే అనే రీతిలో సర్పంచ్ ప్రవర్తన ఉందంటున్నారు. స‌ర్పంచ్ కి గ్రామ కార్యదర్శి పూర్తిగా సహాయ సహకారాలు అందించడంతో మమ్మల్ని ఎవడ్రా ఆపేది అనే రీతిలో సదరు సర్పంచ్. కార్యదర్శి పనులు చక్కబెడుతున్నారని సమాచారం.

పనులు అన్ని సర్పంచ్ కే..!

అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం గ్రామపంచాయతీకి దాదాపు రూ.21ల‌క్ష‌ల వ‌ర‌కు పనులు మంజూరు కాగా వార్డు సభ్యులకు ఏ ఒక్కరికి పనులు అప్పగించకుండా అంతా తానేనని అంతా తనకేనని సదరు సర్పంచ్‌ పాలకవర్గ సభ్యుల సమావేశంలో చెప్పినట్టు సమాచారం. పాలకవర్గం ఏర్పడి నాలుగు నెలలు కాకముందే నవ్వుల పాలు అయ్యే పరిస్థితి ఉందని పాలకవర్గ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సర్పంచ్ ఇలాగే ఒంటెద్దు పోకడతో వెళ్తే ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి ఉందని వార్డు సభ్యులు ఎవరు కూడా మద్దతుగా నిలిచే అవకాశం ఉండకపోవచ్చు అని గ్రామంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ స‌ర్పంచ్ తీరు మార్చుకుంటాడో లేదో వేచి చూడాలి మరి.

Next Story