పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఏకగ్రీవం

by velandi.Saikiran |   (  Updated:2025-11-26 19:54:13  IST  )

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఏకగ్రీవం
X

పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం

ఓ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుసటి రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం రూప్లా నాయక్ తండా సర్పంచ్ ఎన్నిక పూర్తయింది. పోటీ లేకుండానే ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవటమే కాదు.. గెలుపు సంబరాలు కూడా చేసుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. మండలం రుప్లా తండా గ్రామంలో సుమారుగా 502 మంది జనాభా, 8 వార్డులు ఉన్నాయి. అయితే, ఈ గ్రామ తండాను అభివృద్ధి చేసి చూపిస్తానని, అదే గ్రామానికి చెందిన జవహర్ లాల్ నాయక్ ముందుకు వ‌చ్చారు.

దీంతో పార్టీలతో సంబంధం లేకుండా పార్టీల కతీతంగా జవహర్ లాల్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తండా పెద్ద మనిషిగా అందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉన్నందున ఆయనను సర్పంచ్ గా ఎన్నుకునట్లు గ్రామ పెద్దలు, ప్రజలు పేర్కొన్నారు. జిల్లాలోనే మొదటి ఏకగ్రీవ పంచాయతీగా రుప్లా తండా పంచాయతీ నిలిచింది. సర్పంచ్ గా ఎన్నికైన జవహర్ లాల్ నాయక్ ను పంచాయతీ ప్రజలు అభినందనలు తెలిపారు. పంచాయతీ పరిధిలోని అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతుగా కృషి చేస్తానని ఏకగ్రీవ సర్పంచ్ జవహర్ లాల్ నాయక్ పేర్కొన్నారు. ఇదే తరహాలో మరో రెండు తాండాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ మూడు విడత‌ల్లో నిర్వహించబోతున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాణి కుముదిని వెల్లడించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు కూడా ఇప్పటికే అమలులోకి వచ్చింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించబోతున్నారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన రోజే కౌంటింగ్ కూడా జరుగుతుంది. అదే రోజున ఫలితం కూడా వెలువబడుతుంది.

Next Story