సరస్వతి అంత్య పుష్కరాలు సక్సెస్

by velandi.Saikiran |   (  Updated:2026-06-01 21:30:44  IST  )

సరస్వతి అంత్య పుష్కరాలు సక్సెస్ అయిన‌ట్లు పేర్కొన్నారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు

సరస్వతి అంత్య పుష్కరాలు సక్సెస్
X

దిశ, మహదేవపూర్ : సరస్వతి అంత్య పుష్కరాలు సక్సెస్ అయిన‌ట్లు పేర్కొన్నారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ముగింపున‌కు ముఖ్య అతిథిలుగా శ్రీధర్ బాబు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ, గత ఆది పుష్కరాలు, ఇప్పటి అంత్య పుష్కరాలు విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు. అధికార యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక జి ఓ ద్వారా 200 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు నమ్మికతో ఈ కాళేశ్వరం దర్శనానికి వస్తుంటారని, సరస్వతి పుష్కరాలు మొట్టమొదటి సారి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. గత ఏ ప్రభుత్వంలో జరగని విధంగా ఈ పుష్కరాలు నిర్వహించామని హర్షం వ్యక్తం చేశారు. అందరికి మంచి జరగాలని కాశీ పండితులచే హారతి నిర్వహించామని అలాగే సరస్వతి మాతను, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో చివరి రోజు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఈ క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతున్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

Next Story