అదనపు కట్నం వేధింపులు.. వివాహిత బలవన్మరణం

by Bhanu |

అదనపు కట్నం తేవాలని భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలములో చోటుచేసుకుంది.

అదనపు కట్నం వేధింపులు.. వివాహిత బలవన్మరణం
X

దిశ, శంకరపట్నం : అదనపు కట్నం తేవాలని భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలములో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసుల కథనం ప్రకారం ... శంకరపట్నం మండలం లోని చింతగుట్ట గ్రామానికి చెందిన అడెపు సందీప్ జగిత్యాల జిల్లా మెట్ పల్లి గ్రామానికి చెందిన నవ్య (23) ఇరువురు ఇష్టపడడంతో తల్లిదండ్రులు వారి కోరిక మేరకు వివాహం జరిపించినట్లు తెలిపారు.

ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే.. గత కొంత కాలం నుండి సందీప్, వారి తల్లితండ్రులు అదనపు కట్నం తేవాలని నవ్య ను ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేసేవారని ఆ బాధలను భరించలేక తన కూతురు శనివారం మధ్యాహ్నం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది అని తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారని మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు.

Next Story