Sankarapatnam : శిథిలావస్థలో పోలీస్ స్టేషన్

by Chintha Aamani |

శంకరపట్నం మండలంలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్

Sankarapatnam : శిథిలావస్థలో పోలీస్ స్టేషన్
X

దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరుకుంది. ఈ పోలీస్ స్టేషన్ ను దాదాపు 30 సంవత్సరాల క్రితం పిల్లర్స్ లేకుండా గోడల పైన స్లాబ్ పోసి నిర్మించారు. బిల్డింగ్ భవనం ప్రస్తుతం పెచ్చులు ఊడి పోయి స్లాబ్ లోపల ఉన్న ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారింది. జోరుగా కురుస్తున్న వర్షాలతో పోలీస్ స్టేషన్ పూరి గుడిసెల ఉరుస్తుంది. దీంతో ఏఎస్సై రూమ్, ఎస్సై రూమ్ లో ఉన్న బెంచీలు, కుర్చీలు తడవకుండా వర్షపు నీరు అధికారులపై పడకుండా అటు ఇటు జరుపుతున్నారు. ఎస్సైలు మారినప్పుడల్లా వారి సొంత ఖర్చులతో ఎంతో కొంత రిపేర్లు చేసుకుంటున్నారు. ప్రతిక్షణం ప్రజల భద్రత, ప్రజల సంరక్షణకై పాటుపడుతున్న పోలీసులకు పోలీస్ స్టేషన్ ప్రమాదకరంగా పరిణమించిందని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించి ప్రమాదాన్ని నివారించాల్సి ఉంది.

Next Story