భక్తులతో కిటకిటలాడిన బిజిగిర్ షరీఫ్ దర్గా

by Bhanu |

మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తున్న బిజిగిరి షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్ శావల్లీ రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ ముర్తుజా షావలి రహమతుల్లా అలై దర్గా లోని సమాధులకు వేలాదిమంది భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

భక్తులతో కిటకిటలాడిన బిజిగిర్ షరీఫ్ దర్గా
X

దిశ, జమ్మికుంట : మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తున్న బిజిగిరి షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్ శావల్లీ రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి రహమతుల్లాఅలై, హజ్రత్ సయ్యద్ ముర్తుజా షావలి రహమతుల్లా అలై దర్గా లోని సమాధులకు వేలాదిమంది భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

శనివారం రాత్రి గుసుల్ కార్యక్రమం అనంతరం చాదర్ గుల్ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాగా ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఉర్సు ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సంధల్ షరీఫ్ (గ్రంథ లేపనం) భక్తి పారవశ్యంతో జరగగా, వేలాది మంది భక్తులు ఆనందోత్సాహాలతో ఉత్సవంలో పాల్గొని సంధల్ షరీఫ్ ( గ్రంథ లేపనాన్ని) మొల్లపల్లి, పెద్ద బిజిగీరి షరీఫ్ నుండి మేళా, తాళాల మధ్య దర్గాకు తీసుకొని వచ్చి సంధల్ ను దర్గాలోని సమాధులకు అలరింపచేశారు.

ముస్లిం మత గురువు మౌలానా యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ముజావర్లు హైదరాబాద్ నుండి తెచ్చిన ప్రత్యేక చాదార్లు దర్గాలోని సమాధులకు సమర్పించినారు. దీంతో వేలాదిగా తరలి వచ్చిన భక్తులు క్యూలో నిలబడి దర్గాలోని సమాధులకు దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొత్తగూడెం వాస్తవ్యుడు కీర్తిశేషులు గాజి గోవర్ధన్ మిత్రబృందం మూడువేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజురాబాద్ ఏసీపీ మాధవి పర్యవేక్షణలో జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్ఐ శేఖర్ రెడ్డి ల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. సందల్ షరీఫ్ కార్యక్రమం విజయవంతం కావడంతో దర్గా ముతవల్లి మహమ్మద్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్, కార్యవర్గ సభ్యులు భక్తులకు, పోలీస్, వైద్య ఆరోగ్య సిబ్బందికి, విద్యుత్, వక్ఫు బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story