ఈత వనాల పరిరక్షణకు రూ.6 లక్షలు మంజూరు

by Ratna Kumari |

కోరుట్ల నియోజకవర్గంలోని చిన్నమెట్‌పల్లి, మెట్ల చిట్టాపూర్, పెద్దాపూర్ గ్రామాల్లో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదాల వల్ల భారీగా దగ్ధమైన ఈత వనాల పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది.

ఈత వనాల పరిరక్షణకు రూ.6 లక్షలు మంజూరు
X

దిశ, కోరుట్ల రూరల్ : కోరుట్ల నియోజకవర్గంలోని చిన్నమెట్‌పల్లి, మెట్ల చిట్టాపూర్, పెద్దాపూర్ గ్రామాల్లో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదాల వల్ల భారీగా దగ్ధమైన ఈత వనాల పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈత వనాల సంరక్షణతో పాటు భవిష్యత్తులో అగ్నిప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కలెక్టర్ బి. సత్యప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ చిన్నమెట్‌పల్లి, మెట్ల చిట్టాపూర్, పెద్దాపూర్ గ్రామాల ఈత వనాల్లో బోరువెల్ పంప్‌సెట్లు ఏర్పాటు చేసేందుకు రూ.6 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఈత వనాల పరిరక్షణకు అవసరమైన నీటి వసతి అందుబాటులోకి రావడంతో పాటు, భవిష్యత్తులో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే స్పందించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Next Story