తారు రోడ్ల ప్యాచ్ వర్క్ పనులకు రూ.55.43 ల‌క్ష‌లు మంజూరు

by Ratna Kumari |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని తారు రోడ్ల ప్యాచ్ వర్క్ ల రిపేర్లకు రూ.55.43 ల‌క్ష‌లు మంజూరు అయిన‌ట్టు శుక్రవారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య తెలిపారు.

తారు రోడ్ల ప్యాచ్ వర్క్ పనులకు రూ.55.43 ల‌క్ష‌లు మంజూరు
X

దిశ‌, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని తారు రోడ్ల ప్యాచ్ వర్క్ ల రిపేర్లకు రూ.55.43 ల‌క్ష‌లు మంజూరు అయిన‌ట్టు శుక్రవారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వర్షాకాలంలో 17 గ్రామాలకు సంబంధించిన తారు రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిన‌ట్టు తెలిపారు. కిషన్ దాస్ పేట నుంచి కోరుట్ల పేట వరకు లక్ష రూపాయలు, కిషన్ దాస్ పేట నుంచి శ్రీ రామకోటి కోరుట్లపేట వరకు 3 లక్షల 50 వేలు, నారాయణపూర్ నుండి రాగట్లపల్లి వరకు 3 లక్షల 10 వేలు వెంకటాపూర్ నుండి పోతిరెడ్డి పల్లె వరకు 6 లక్షలు పీడబ్ల్యుజి రోడ్డు నుండి అక్కపల్లి వరకు 4 లక్షలు, పోతిరెడ్డి పల్లె నుండి ధర్మారం వరకు 7 లక్షలు పీడబ్ల్యుసి రోడ్డు నుండి దుమాల వరకు 2 లక్షలు, పిడబ్ల్యుజీ రోడ్డు నుండి పదిర వరకు 1 లక్ష,50, వేలు పీడబ్ల్యుజి రోడ్డు నుండి వయా పెద్దమ్మ వరకు లక్ష రూపాయలు, అక్కపల్లి నుండి శివంగాలపల్లె వరకు 4, లక్షలు 50, వేలు.. తిమ్మాపూర్ వరకు 2 లక్షల 50 వేలు, బాకూరు పల్లె నుండి సేవాలాల్ తండా వరకు లక్ష రూపాయలు, పీడబ్ల్యుజి రోడ్డు బండలింగంపల్లి వయా పెద్దమ్మ టెంపుల్ వరకు లక్ష రూపాయలు, కోరుట్ల పేట నుండి సింగారం వరకు 5 లక్షల 30 వేలు, ఎల్లారెడ్డిపేట నుండి వయా కిషన్ దాస్ పేటకు లక్ష 50 వేలు, ఎల్లారెడ్డిపేట నుండి వయా పెట్రోల్ బంక్ మీదుగా కోరుట్ల పేటకు 3 లక్షల 10వేలు. బండ లింగంపల్లి నుండి నారాయణపూర్ వయా మానేరు బ్రిడ్జి 7 లక్షల 40 వేలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి డైరెక్టర్ మెండె శ్రీనివాస్ నాయకులు శనిగరం బాలరాజు గుర్రాల రాజిరెడ్డి. వంగ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు

Next Story