సెల్యూట్ పోలీస్..ఆత్మహత్య చేసుకునే మహిళను కాపాడి

by velandi.Saikiran |

అర్నకొండకు చెందిన ముప్పిడి అనిత (50) అనే మహిళ శనివారం రాయపట్నం వద్ద గోదావరి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు

సెల్యూట్ పోలీస్..ఆత్మహత్య చేసుకునే మహిళను కాపాడి
X

దిశ, వెల్గటూర్: అర్నకొండకు చెందిన ముప్పిడి అనిత (50) అనే మహిళ శనివారం రాయపట్నం వద్ద గోదావరి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించగా ధర్మపురి బ్లూ కోల్ట్ పోలీస్ రణధీర్ గౌడ్ ఆమెను రక్షించారు. ఆమె మానసిక పరిస్థితిని గమనించి వెంటనే స్పందించి కాపాడారు. అనంతరం ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలను తెలుసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం బంధువులకు సమాచారం ఇచ్చి ఆమెను అప్పగించారు. బ్లూ కోల్ట్ పోలీస్ అప్రమత్తంగా వ్యవహరించటం వల్ల మహిళ ప్రాణాలు దక్కాయని ప్రజలు అభినందించారు.

Next Story