కరీంనగర్ పోస్టల్ ఎస్పీగా సైదిరెడ్డి బాధ్యతల స్వీకరణ

by Ratna Kumari |

కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ గా కె.సైదిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

కరీంనగర్ పోస్టల్ ఎస్పీగా సైదిరెడ్డి బాధ్యతల స్వీకరణ
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ గా కె.సైదిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మూడు రోజుల క్రితం జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా కరీంనగర్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్న కె.శివాజీ హన్మకొండ డివిజన్ కు బదిలీ కాగా.. ఆయన స్థానంలో సైదిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సైదిరెడ్డి కరీంనగర్ పోస్టల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పోస్టల్ అధికారులు, సిబ్బంది, వివిధ యూనియన్ల నాయకులు నూతన పోస్టల్ ఎస్పీ సైదిరెడ్డికి పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు.

Next Story