ఎలుగుబంటి సంచారం

by velandi.Saikiran |   (  Updated:2025-10-23 15:33:45  IST  )

రాత్రి వేళల్లో ఎలుగుబంటి సంచరించడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు, ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు.

ఎలుగుబంటి సంచారం
X

దిశ, సైదాపూర్: రాత్రి వేళల్లో ఎలుగుబంటి సంచరించడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు, ప్రయాణీకులు భయాందోళనకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సమ్మక్క-సారలమ్మ గుట్ట వద్ద సైదాపూర్- హుజూరాబాద్ ప్రధాన రహదారిపై రాత్రి వేళల్లో ఎలుగుబంటి సంచరించడం క‌ల‌క‌లం రేపింది. సమ్మక్క గుట్ట వద్ద ఉన్న పెట్రోల్ పంపు యజమాని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో ఎలుగుబంటి సంచరించిన బీసీ ఫుటేజీలు ఆ ప్రాంతంలోని ప్రజలకు గుబులు పుట్టిస్తోంది. జాగిరిపల్లి గ్రామంలో క్వారీ ఏర్పాటు చేయటం క్వారీలో పనులు జరుగుతుండటంతో గుట్టపై ఉండాల్సిన వన్య ప్రాణులు రోడ్డుపై సంచరిస్తున్నాయని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా అటవిశాఖ అధికారులు రోడ్డుపై సంచరిస్తున్న ఎలుగుబంటిని పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story